18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి: అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
14 Views

వికారాబాద్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఓటరు ముసాయిదా తుది జాబితా పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సమావేశం నిర్వహించి ఓటర్ ముసాయిదాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1133 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 1400 మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలు లేవని ఆయన తెలిపారు. ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోదలచిన వారు ఫారం-8 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. పాత కార్డు స్థానంలో నూతన కార్డు పొందేందుకు అవకాశం ఉందని దరఖాస్తు చేసుకున్నట్లయితే పోస్టల్ ద్వారా కలర్ తో కూడిన ఏపిక్ కార్డును పొందవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో తుది చివరి ప్రచురణలో 9,84,068 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో 4,86, 109 మంది పురుషులు, 4,97,920 మంది స్త్రీల ఓటర్లతో పాటు 39 మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారని ఆయన తెలిపారు. పరిగి నియోజకవర్గంలో 2,66, 273 మంది ఓటర్లకు గాను 1,33,625 మంది పురుషులు, 1,32,639 మంది స్త్రీలు, 9 మంది ట్రాన్స్ జెండర్లు ఓటర్లు ఉన్నారన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 2,31,679 మంది ఓటర్లు నమోదు కాగా 1,15,019 మంది పురుషులు, 1,16,647 మంది స్త్రీలు, 13 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. తాండూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,43,849 ఉండగా 1,18,228 మంది పురుషులు 1,25,614 మంది స్త్రీలు 7 గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలిపారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం లో 2,42,267 మంది ఓటర్లలో 1,19,237 పురుష ఓటర్లు ఓటర్లు కాగా 1,23,020 మంది స్త్రీల ఓటర్లతో పాటుగా 10 మంది ట్రాన్స్ జెండర్ ల ఓట్లు కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నిక ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు ఎన్నికల విభాగం తహసిల్దార్ నరసింహారెడ్డి తోపాటు పాల్గొన్నారు.