చేవెళ్ల పార్లమెంట్ BSP BRS ఉమ్మడి అభ్యర్థిగా బీఎస్పీ రాష్ట్రనేత విజయార్య క్షత్రియ బరిలోకిదిగే ఛాన్స్

0
15 Views

అనంతగిరి డెస్క్ : విజయార్య క్షత్రియ మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, నాటి ఉద్యమనేత నేటి మాజీ ముఖ్యమంత్రి KCR కి అలాగే టీజాక్ చీఫ్ ప్రొఫెసర్ కోదండ రామ్   ప్రత్యేక శిష్యుల్లో ఒకరుగా ఉన్నవాడు, తెరాస పార్టీలో చేరకుండా ఇన్నాళ్లు నమ్మిన బహుజన సిద్ధాంతాన్ని వదలకుండా బీఎస్పీ పార్టీ ఎదుగుదలలో ఇన్నాళ్లు పనిచేశారు. 2018లో చేవెళ్ల పార్లమెంట్ బీఎస్పీ పార్టీ ఇంచార్జిగా పనిచేశారు, BSP పార్టీ పక్షాన 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, 2019 నుండి నేటి వరకు బీఎస్పీ పార్టీ నిర్మాణం పోరాటం ప్రచారం లో చాలా క్రియాశిలకంగా పనిచేస్తున్నారు. BSP పార్టీలో అత్యంత కీలకనాయకులుగా అనతికాలంలోనే ఎదిగారు, పార్టీలో ‘సహజ నాయకుడు గా బహుజన బ్రాండ్’ గా గొప్ప పెరుగడించారు. స్వయంగా రాజకీయ వ్యూహకర్త గా, రాజకీయ మేధావిగా ప్రజలకు తెలిసినవాడు అలాగే డాక్టర్ ఆరెస్పి గారు బీఎస్పీ పార్టీలో చేరిన తరువాత బీఎస్పీ తెలంగాణా రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్కి  కుడిబుజంగా పేరున్నటువంటి, నిన్నటి BSP BRS పొత్తు కుదుర్చటంలో కీలక పాత్ర పోషించినటువంటి, పార్టీలో బీఎస్పీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల నిర్వహణ కమిటీ చైర్మన్, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతల్లో ఉన్నటువంటి విజయార్య కి BSP BRS కూటమి తరుపున చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకీ దిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో BSP పార్టీలో అలాగే BRS పార్టీ అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయి….

విజయార్య క్షత్రియ  కట్టర్ బహుజన వాది. బహుజనోద్ధరణకోసం ఉభయ తెలుగు రాష్ట్రలల్లో ఫూలే సాహు అంబేద్కర్ కాన్షిరాం భావజాలం వ్యాప్తిలో అలుపెరుగని పోరాటం చేశారు. నేడు బీఎస్పీ తెలంగాణా రాష్ట్రంలో కీలకనేతగా పార్టీలో సౌమ్యుడుగా మృధుభాషిగా అలాగే సైద్ధంతికంగా విబేదించుకునే ప్రతిపక్షపార్టీలకు సింహస్వప్నంగా ఎదిగిన గొప్ప నాయకులు. చేవెళ్ల పార్లమెంట్లోని అన్నీ అసెంబ్లీ సెగ్మెంట్స్లల్లో గొప్ప క్యాడర్ ను బీఎస్పీ సైన్యాన్ని తయారు చేసిన చరిత్ర విజయార్య క్షత్రియ  సొంతం. విజయార్య   అన్నీ కుల మత వర్గాల్లో మంచి పేరు ఉంది.