జిల్లాలో సీసీ రోడ్ల పనులు 60 శాతం పూర్తి : జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

0
10 Views

వికారాబాద్: జిల్లా లో జరిగే సి సి రోడ్ల అభివృధి పనులు ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తి చేసుకున్నామని, మిగతా 40 % శాతం పనులు కూడా పెండింగ్ ఉంచకుండా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం టెలి కాన్ఫరెన్సు ద్వార మాట్లాడుతూ. జిల్లా లో జరిగే సి సి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి అయిన వాటికీ ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ, ఎట్టి పరిస్టితిలో ఆగకుండా పనులు జరిగే లా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచి గ్రామ పరిధి లోజరిగే ఉపాది హామీ పనులు పూర్తి చేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. టెలి కాన్ఫరెన్సు లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు డీఈ లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.