అంతర్ రాష్ట్ర శికారి గ్యాంగ్ అరెస్ట్ – ముఠాలో ప్రధాన నేరస్తులు తండ్రికొడుకులే: వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి

0
669 Views

వికారాబాద్.: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలలో వరుసగా దొంగతనాలు చేస్తున్న శికారి గ్యాంగ్ ను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని, వీరు జూన్ 30న వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని టీచర్స్ కాలనీలో 5 ఇళ్లలో దొంగతనం చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పట్టుకున్నామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా ఎస్సీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ గుంతకల్ కు చెందిన శికారి గ్యాంగ్ ప్రధాన నేరస్తులైనా తండ్రి పెద్ద సర్దార్, కుమారుడు శికారి మద్దిలేటి, సమీప బంధువులు చిన్న సర్దార్ అలియాస్ గబ్బార్ సింగ్లు 28న రైలు మార్గం ద్వారా యాద్గిర్ చేరుకుని అక్కడి నుండి పరిగికి బస్సు మార్గం ద్వారా ఉదయం చేరుకున్నారు. 30వ తేదీ ఉదయం పరిగిలో రెండు షోలు సినిమా చూసిన నింధితులు రాత్రి మధ్యం సేవించి తాళాలు ఉన్న ఇండ్ల గురించి రక్కి నిర్వహించి తాళాలు వేసిన 5 ఇండ్లను గుర్తించడం జరిగిందన్నారు. రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు ఐదు ఇండ్లలో దొంగతనం చేయగా రెండు ఇళ్లలో ఒక ఇంటిలో 12 తులాల బంగారం, 1.20 లక్షల నగదు, మరో ఇంటిలో 3.3 తులాల బంగారును దొంగలించారన్నారు.
మూడు ఇళ్లలో దొంగలకు ఎలాంటి బంగారం, నగదు దొరకకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం  పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు క్లూస్ టీమ్, సీసీఎస్ అధికారులు సేకరించిన ఆధారాలతో పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీటీవీల ఆధారంగా టెక్నికల్ ఆధారాల ద్వారా గుంతకలకు చెందిన శికారీ గ్యాంగ్ గా గుర్తించడం జరిగిందన్నారు.
అందులో చిన్న సర్దారు జూలై 29న అరెస్ట్ చేసి విచారించడం జరిగిందని తండ్రికొడుకులు పూణెలో ఉన్నారని సమాచారం రావడంతో శుక్రవారం వారిని పూణెలో అదుపులోకి తీసుకోవడం జరిగిం
దని ఎస్పీ తెలిపారు. తండ్రి కొడుకులు శికారీ గ్యాంగ్ ప్రధానమని వారు దొంగతనం చేసే సమయంలో మూడో వ్యక్తిని కొత్త వారిని తీసుకెళ్తారని ఒక సారి బూజు, తేజలాంటి కొత్త వ్యక్తులను
దొంగతనాలకు తీసుకోని పోయే వారని విచారణలో తెలిసిందన్నారు. పెద్ద సర్దార్ పై అన్ని రాష్ట్రాల్లో కలిపి 70కి పైగా కేసులు ఉన్నాయని, శికారి మద్దిలేటి పై 45 దొంగతనం కేసులు ఉన్నాయని పేర్కొ
న్నారు. వారి వద్ద పది తులాల బంగారం రికవరీ చేయడం జరిగిందని, బంగారం కొనుగోలుచేసిన శికారి అది, పుణెకు చెందిన కుసార్ రాంచందర్ చవాస్ పై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తమ గ్రామాల్లో గాని కాలనీల్లో కాని అనుమానస్పదంగా తిరుగుతే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసులో క్రియశీలకుగా వ్యవహరించిన
పరిగి సీఐ శ్రీనివాస్, సీసీఎస్ సీఐ బలవంతయ్య, పరిగి ఎస్ఐ సంతోష్, హెడ్ కానిస్టేబుల్స్ జయవర్దన్, చెన్నయ్యగౌడ్, గోవిందప్ప, కానిస్టేబుల్స్ కృష్ణరెడ్డి, అంజప్ప, సత్తయ్య, రాజు, రాఘవేందర్ రెడ్డి, రామకృష్ణ గాయత్రిలకు రివార్డు అందించడం జరుగుతుందని ఎస్సీతెలిపారు.