పీరంపల్లి కల్తీ కల్లు బాదితులును పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

0
99 Views

వికారాబాద్:పీరంపల్లి  కల్తీకల్లు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని  బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమాల్ రెడ్డి అన్నారు.శనివారం వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు కమల్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు రాంరెడ్డి ,పడగల అశోకు ,ఎండి గయాస్ ,ఎం రమేష్ ,పాండు, మహిపాల్ నాయక్, రాజు, మల్లేష్ యాదవ్, అంజి , పరామర్శించారు. వికారాబాద్ మిషన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్లు బాధితులను పరామర్శించి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కమల్ రెడ్డి మాట్లాడుతూ కల్తీకల్లు బాధితులను ప్రభుత్వ ఆదుకోవాలని మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఎక్సైజ్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పడిగళ్ళ అశోక్ మాట్లాడుతూ బాధితులను అవమానపరిచే విధంగా ఎక్సైజ్ సూపర్డెంట్ నీళ్ల వల్లనే ఇలా జరిగిందని చెప్పడం సరైనది కాదని బాధితులే స్వయంగా మేము కల్లు తాగినందుకే మాకు ఇలా జరిగిందని ఒకవేళ త్రాగునీరు వాళ్ళు అయితే మా కుటుంబ సభ్యులకు ఎందుకు జరగలేదని అంటున్నారు. దీనికి సూపర్డెంట్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సూపర్డెంట్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులను మెరుగైన వైద్యం కోసం అందరిని హైదరాబాద్ కు తరలించి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వికారాబాద్ మిషన్ హాస్పిటల్ లో మాసన్న గారి వెంకటమ్మ (65) వృద్ధురాలు సీరియస్ కండిషన్లో ఉన్నారు వారిని హైదరాబాద్ తరలించాలని డిమాండ్ చేశారు.