నిరుపేద కుటుంబాలకు వరం సీఎంఆర్ఎప్:వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుదాకర్ రెడ్డి

0
387 Views

వికారాబాద్:నిరుపేద కుటుంబాలకు వరం సీఎంఆర్ఎప్ అని వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి  అన్నారు.శనివారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు  గడ్డం ప్రసాద్ కుమార్  ఆదేశాల మేరకు  వికారాబాద్ మున్సిపల్ లోని వివిధ వార్డులకు సంబందించిన CMRF చెక్కులను (ముఖ్యమంత్రి సహాయనిధి) లబ్ధిదారులకి  అందజేసారు.   ఈ సందర్బంగా 37 చెక్కులు (సుమారు 10 లక్షలు) రూపాయలు CMRF ద్వారా ఇవ్వడం జరిగింది.. నిరుపేద కుటుంబలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీ. గడ్డం.ప్రసాద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్ లు నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.