రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని పునరాలోచించాలి:AIKMS జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య

0
157 Views

వికారాబాద్: రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని పునరాలోచించాలని  AIKMS జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు.శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ముద్ద వీర మల్లప్ప కన్వెన్షన్ హాల్లో AIKMS అఖిల భారత రైతు కూలి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కోటేశ్వరరావు మండల వెంకన్న మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో నేవీ ఆర్డర్ స్టేషన్ నిర్మాణం కోసం 12 లక్షల చెట్ల కొట్టివేతను ఉపసంహరించుకోవాలని అడవులను రక్షించాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలి నిరుపయోగమైనటువంటి అనేక భూములు దేశంలో ఉన్నాయి అలాంటి చోట రాడ్డా స్టేషన్ ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రెండు లక్షల రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలి.రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలను పరిష్కరించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి సమస్యల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు కానీ ధరణి సమస్యలతో రైతులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు వెంటనే ధరణి సమస్యలను పరిష్కరించాలి కౌలు రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలి కాలు రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం ప్రత్యేక పాలసీని తయారు చేసి కౌలు రైతులను ఆదుకోవాలి అన్నారుఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్ నాయకులు డేవిడ్ కుమార్, నాగేశ్వరరావు, భూమన్న, సారంగపాణి, నరసయ్య మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.