పీల్డ్ శిక్షణలో భాగంగా వికారాబాద్ ను సందర్శించిన శిక్షణ పొందుతున్న పారెస్ట్ బీట్ ఆపీసర్లు

0
122 Views

వికారాబాద్:తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి లో శిక్షణ పొందుతున్న 33 మంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, వారి ఫీల్డ్ శిక్షణలో భాగంగా శనివారం  వికారాబాద్ జిల్లాలోని అటవీ శాఖ చేపట్టిన వివిధ పనులను సందర్శించండం జరిగిందని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. ఈ సందర్శనలో, అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో అభివృద్ధి చెందుతున్న టూరిజం పార్కింగ్, ట్రెకింగ్ ఏరియా, వాచ్ టవర్, గ్రాస్ ల్యాండ్ ఏరియా వంటి ప్రాంతాలను స్టడీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, అడవుల అభివృద్ధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని, ఈ క్రమంలో వారి పైన వత్తిడి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వృత్తి జీవితంలో ఉన్న వత్తిడులను అధిగమించడానికి సమాజంలోని వ్యక్తులతో, సహచరులతో, మరియు ఇతర అధికారులతో ఆరోగ్యకరమైన సంబంధాలు నెలకొల్పుకోవాలని సూచించారు.అడవుల ప్రత్యేకతను బీట్ ఆఫీసర్లు గుర్తించి, వాటిని సంరక్షించాలన్నారు. ప్రస్తుతం భారతదేశంలో జనాభా పెరుగుదలతో ఫారెస్ట్ భూములపై తీవ్రమైన వత్తిడి ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ విధులను నిర్వర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్యామ్ కుమార్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్  అరుణ, మరియు తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ సుభాష్ చంద్ర యాదవ్ పాల్గొన్నారు.