వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ శ్రీనివాస్

0
168 Views

వికారాబాద్:వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనదారులకు సూచించారు. పోలీస్ సిబ్బందితో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ తో పాటు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ…రోడ్డుపై నడిపే ప్రతి వాహన దారుడు ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. అనుకొని సమయం ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి వాహన దారుడు వాహనానికి ముందు, వెనక నెంబర్ ప్లేట్ తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలని, ర్యాష్ డ్రైవ్ చేయవద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా వాహనాలు నడిపి పైన్స్ ఉన్న వాహనదారులు సైతం సకాలంలో ఫైన్ లు చెల్లించాలని, ఇప్పుడు పోలీసులు ఎక్కడా వాహనదారుల వద్ద డబ్బులు వసూళ్లు చేయడంలేదని, కేవలం సరైన పత్రాలు, పెండింగ్ చాలాన్స్ మాత్రమే చూస్తున్నారని వాహనదారులు అపోహలకు పోయి పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్న సమయంలో స్పీడ్ గా వెళ్లే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేష్, సిబ్బంది శ్రీనివాస్, క్రిష్ణ ఉన్నారు.