కొండా లక్ష్మణ్ బాపూజీ ని ప్రతి ఒక్కరు స్పూర్తి తీసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
89 Views

వికారాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణా ఉద్యమ కారకులు, స్వాతంత్య్రఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, ప్రతి ఒక్కరు అయన ను స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టరరేట్ సమావేశము హాలు నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109 వ జయంతి సందర్భంగా అయన చిత్ర పటానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్తానిక సమస్తలు) సుదీర్  తో కలిసి జ్యోతి ప్రజల్వన గావించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని, వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 1969వ సంవత్సరంలో తొలి దశ పోరాటం లోనే కీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తనకంటూ ఏమి లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సమావేశాలు ఏర్పాటు చేసుకొనుటకు తన యొక్క ఆస్తులు మొత్తం కూడా దానం చేసిన త్యాగశీలి, ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు బడగు బలహీన వర్గాలు అభివృద్ది చేందాలని ఆశించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా జరపడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ సుదీర్ , బి సి సంక్షేమ అధికారి ఉపేందర్ , డి పి ఆర్ ఓ చెన్నమ్మ,కౌన్సిలర్ దత్తు తో పాటు వివిధ సంఘాల నాయకులు కలెక్టరేట్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.