నేవీ రాడార్ విషయంలో వదంతులు నమ్మవద్దు:రిటైర్డ్ ప్రొఫెసర్, పర్యావరణ వేత్త, ముక్తారెడ్డి

0
128 Views

వికారాబాద్ : నేవీ రాడార్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలలో భయాందోళనలు కలిగే వదంతులు సృష్టిస్తున్నారని, కమ్యూనిష్టుల తప్పుడు ప్రచారం నమ్మవద్దని రిటైర్డ్ ప్రొఫెసర్, పర్యావరణ వేత్త, ముక్తారెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ లో నిర్వహించిన సమావేశంలో పలువురు వివిద రంగాలకు చెందిన విద్యావేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, నాయకులు, విద్యార్దులు, జర్నలిస్టులు పాల్గొని తీర్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చినా, దానిని అడ్డుకునేందుకు కమ్యూనిష్టులు ముందుంటారని ఆరోపించారు. నేవీ రాడార్ అనేది దేశ రక్షణకు సంబందించినదని, దానికి దేశంలో ఎక్కడ ఏ భూమి కావాలన్నా భారత పౌరులు భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. రెండు సంవత్సరాల పూర్వమే నేవీ రాడార్ అనే ప్రక్రియ మొదలై, అన్ని పార్టీలు, స్థానిక ప్రజలు అక్కడి ధామగుండం ఆలయ భక్తులు, పూజారి రాడార్ కు సహకరించేందుకు సిద్దమయ్యారని చెప్పారు. ఇప్పుడు రాడార్ పనులు ప్రారంబించే ముందు కమ్యూనిస్టు నాయకులు తలదూర్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నేవీ అధికారులకు, సైంటిస్టులకు తెలియని కొత్త కొత్త అబద్ధపు విషయాలు ప్రజలలోకి చోప్పించేందుకు యత్నిస్తున్నారని అరోపించారు. నేవీ రాడార్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, చెట్లు నరికేస్తారని, వరదలు వస్తాయని, రేడియేషన్ వచ్చి ప్రజలు రోగాల భారిన పడతారనే అటువంటి అబద్ధాలను ప్రజలకు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఎవ్వరు ఇలాంటి వదంతులు నమ్మకూడని సూచించారు.