పేదల ఇళ్లను కూల్చడం సరికాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

0
83 Views

హైదరాబాద్:హైదరాబాద్ స్లమ్‌ల పరిసరాల్లో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ముందే హైడ్రా స్లమ్‌లను కూల్చకూడదని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. నగరంలో జలవిహార్, ఐమాక్స్‌లాంటి ప్రముఖ ప్రదేశాలు ఉన్నప్పటికీ, పేదల ఇళ్లను లక్ష్యం చేయడం అనైతికమని ఆయన వ్యాఖ్యానించారు.

మూసీ నది పరిసరాల్లో నివాసం ఉంటున్న నిర్వాసితులకు కౌన్సిలింగ్ అందించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇళ్లను ఖాళీ చేయించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇళ్లపై రెడ్‌మార్క్ వేయడం, సర్వే నిర్వహించడం తొందరపాటు చర్యలని అభివర్ణించారు.

ప్రభుత్వం ఎప్పుడో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుతం ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కూల్చిన ఇళ్లకు తిరిగి అదే ప్రదేశంలో నివాస ఏర్పాట్లు చేయడం మంచిదని సూచించారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు దానం నాగేందర్ తెలిపారు