నేవి రాడార్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి:బీఆర్ఎస్ నాయకులు చైతన్యకిరణ్,రాజేందర్ గౌడ్

0
106 Views

వికారాబాద్:గత ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు గ్రీన్ కోసం ఖర్చు పెడితే ప్రస్తుత ప్రభుత్వం దానికి విరుద్ధంగా లక్షల చెట్లు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాయకులు చైతన్య కిరణ్, రాజేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవ్ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6న బహుజన బతుకమ్మ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దామగుండం పరిరక్షణ కోసం ముందుకు రావాలని తెలిపారు. ఈ దామగుండం నేవీ రాడార్ విషయంలో ప్రభుత్వాలు పునరాలోచన చేసి ఇక్కడ కాకుండా జనసాంద్రత లేని ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతం నుండే సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆలోచించి దీని మీద శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం పరిరక్షణ సమితి జేఏసీ చైర్మన్ వెంకటయ్య, సునంద, నాయకులు రామన్న, సత్యన్న, గట్టా నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.