మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న 8మంది విధ్యార్థులు డీబార్ :ఇంటర్ నోడల్ అధికారి ఎన్ శంకర్

0
16 Views

వికారాబాద్:ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా పన్నెండవ రోజు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న 8 మంది విద్యార్థులపైన మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్ తెలిపారు. పెద్దేముల్ పరీక్షాకేంద్రం లో కాపీ చేస్తున్న 6మంది విద్యార్థులను, అదేవిధంగా కొకట్ లోని పరీక్షా కేంద్రం లో ఇద్దరు విద్యార్థులను తెలంగాణ ఇంటర్ బోర్డు పరిశీలకులు డీబార్ చేసినట్టు ఆయన తెలిపారు.అయితే జనరల్ కోర్సులలో 6447 మంది విద్యార్థులకు గాను 6301 మంది విద్యార్థులు, అదేవిధంగా ఒకేషనల్ కోర్సులలో 1298మంది విద్యార్థులకు గాను 1255 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. గురువారం జనరల్ కోర్సులకు సంబందించిన పరీక్షలు ప్రశాంతం గా ముగిసినట్టు ఆయన తెలిపారు. అయితే ఒకేషనల్ పరీక్షలు మరో రెండు రోజులు కొనసాగానున్నాయి.