141 వ మార్క్స్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన CPI (ML) న్యూ డెమోక్రసీ

0
39 Views

వికారాబాద్ : స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ కార్మికుల హక్కుల కోసం , దోపిడీ లేని సమాజం కోసం పోరాటం చేసిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ యొక్క వర్ధంతి సందర్భంగా CPI (ML) న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా CPI (ML) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి Y. మహేందర్ మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ (జననం మే 5, 1818, ట్రైయర్ , రైన్ ప్రావిన్స్, ప్రుస్సియా [జర్మనీ]-మార్చి 14, 1883, లండన్ , ఇంగ్లాండ్ మరణించారు) విప్లవకారుడు, సామాజిక శాస్త్రవేత్త , చరిత్రకారుడు మరియు ఆర్థికవేత్త అని తెలియజేయడం జరిగింది. మార్క్స్ ప్రచురించిన (1848) కమ్యూనిస్ట్ మానిఫెస్టో , సోషలిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ కరపత్రం మరియు ఉద్యమం యొక్క అత్యంత ముఖ్యమైన పుస్తకం అని దాస్ కాపిటల్ రచయిత కూడా అని తెలియజేయడం జరిగింది. దానితోపాటు ఈ ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా మరియు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన జీవితాంతం కృషి చేసిన మహోన్నతుడు కార్ల్ మార్క్స్ అని తెలియజేయడం జరిగింది.1850 నుండి 1864 వరకు మార్క్స్ భౌతిక దుఃఖంలో జీవించాడు అని మార్చి 1850లో అతను మరియు అతని భార్య మరియు నలుగురు చిన్న పిల్లలను బహిష్కరించారు మరియు వారి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు అని అయినా ఈ దోపిడి వ్యవస్థను కూల్చాలని, సమ సమాజం కోసం, కార్మిక, కర్షక రాజ్యం కోసం తన బాధలను, కష్టాలను కూడా లెక్క చేయకుండా ఈ ప్రపంచ చరిత్రనే మార్చేయడం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని పేర్కొనడం జరిగింది. ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని నినాదం ఇచ్చి ప్రపంచ కార్మిక హక్కుల కోసం పోరాడాలని పోరాటాలకు పునాది వేసిన మహనీయుడు కార్ల్ మార్క్స్ అని తెలియజేయడం జరిగింది. నేడు ప్రపంచం మొత్తము కూడా మార్క్సిజం కోసం ఎదురుచూస్తుందని , అంతిమంగా మార్క్స్ కలలు కన్నా సోషలిజం మే ఈ ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాములు, పి.శ్రీనివాస్, రాజేష్, శ్రీకాంత్, జైపాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.