బస్సులో అధిక రద్దీతో ఊపిరి ఆడక కండక్టర్ అనిత అస్వస్థత -బస్సులోనే దవాఖానకు తీసుకెళ్లిన డ్రైవర్

0
9 Views

అనంతగిరి డెస్క్:   అసలే వేసవి కాలం.. అధిక సంఖ్యలో ప్రయాణికులు.. తీవ్రమైన ఉక్కపోతతో బస్సులోనే కండక్టర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన రామాయంపేట బస్టాండ్ లో జరిగింది. మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెదక్ నుంచి రామాయంపేట బస్టాండ్ కు వచ్చింది. తిరిగి ప్రయాణికులను ఎక్కించుకుని మెదక్ కు వెళ్లడానికి బయలు దేరింది. ఈ క్రమంలో కండక్టర్ అనిత టికెట్లను పంపిణీ చేస్తుండగా చాతిలో నొప్పి వస్తుందంటూ డ్రైవర్ కు చెప్పి, కుప్పకూలింది. బస్సులో ఉన్న ప్రయాణికులను అక్కడే దింపి, బస్సు లోనే కండక్టర్ అనితను రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. వైద్యులు కండక్టరు చికిత్స ప్రారంభించడంలో అనిత కోలుకున్నది. బస్సులో రద్దీ అధికంగా ఉండడంతో ఊపిరి ఆడక కండక్టర్ అనిత అస్వస్థతకు గురైనట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు.