హీరో రవితేజకు గాయాలు

0
234 Views

అనంతగిరిడెస్క్:ప్రముఖ హీరో రవితేజ RT75 సినిమా షూటింగ్‌ సమయంలో గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగిందని సమాచారం. రవితేజ కుడిచేతికి తీవ్ర గాయం కాగా, వెంటనే ఆయనను యశోదా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రి వైద్యులు రవితేజ చేతికి విజయవంతంగా ఆపరేషన్‌ చేశారు. అయితే, పూర్తిగా కోలుకోవడానికి రవితేజకు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ కారణంగా, ఆయన ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు విరామం తీసుకోనున్నారు.వైద్యులు సూచించిన ఈ విశ్రాంతి సమయంలో రవితేజ పూర్తిగా కోలుకోవాలని ఆశిద్దాం. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.