ఇసుక మాఫియా గురించి పోలీసులకు చెప్తే.. పోలీసులు ఇసుక మాఫియాకు అతని సమాచారం ఇచ్చారు.

0
21 Views

అనంతగిరి డెస్క్ : మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామ వాగులో ఇసుక అక్రమ దందాపై ఆ గ్రామస్తుడు ఎర్రోళ్ల హరీష్ 100కు డయల్ చేసి చెప్పాడు.. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సిన చిన్న శంకరంపేట ఎస్ఐ వారిపై చర్యలు తీసుకో పోగా, ఎర్రోళ్ల హరీష్ గురించి వారికి చెప్పాడు. దీంతో ఇసుక మాఫియా చేసేవారు ఎర్రోళ్ల హరీష్ ఇంటిపై దాడి చేసి అతడిని, అతడి తండ్రిని రాళ్లతో, కర్రలతో తీవ్రంగా గాయపరిచారు.. ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎర్రోళ్ల హరీష్ సీఐకి పిర్యాదు చేసాడు