చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డి, తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులు వీరే

0
33 Views

వికారాబాద్: చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డికి దక్కుతుందని అందరూ అనుకున్నట్లే వరించింది.  సునీతా మహేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్​ కసరత్తు చేసింది. ఈ లిస్ట్ లో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది.. తెలంగాణలోని మొత్తం17 లోక్ సభ నియోజక వర్గాల్లో దాదాపు 9 నుంచి11 స్థానాలకు అభ్యర్థులను సీఈసీ ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు రేసులో ఉన్నారు.

తుది జాబితాలో పరిశీలనలో ఉన్న పేర్లు

1. మహబూబ్‌గర్ : వంశీచంద్ రెడ్డి
2. చేవెళ్ల : సునీత మహేందర్ రెడ్డి
3. నిజామాబాద్ : టీ జీవన్ రెడ్డి
4. పెద్దపల్లి : గడ్డం వంశీకృష్ణ
5. సికింద్రాబాద్ : బొంతు రామ్మోహన్/ఆయన సతీమణి
6. మల్కాజ్ గిరి: చంద్రశేఖర్
7. జహీరాబాద్ : సురేష్ షెట్కార్
8. మెదక్ : నీలం మధు
9. నల్లగొండ : జానారెడ్డి/రఘువీర్ రెడ్డి
10. కరీంనగర్ : ప్రవీణ్ రెడ్డి
11. మహబూబాబాద్ : బలరాం నాయక్/ విజయ భాయ్ బానోతు
12. భువనగిరి : చామల కిరణ్ కుమార్ రెడ్డి/కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు
13. నాగర్ కర్నూల్ : మల్లు రవి/ సంపత్ కుమార్
14. ఖమ్మం : నందిని/ ప్రసాద్ రెడ్డి/ యుగంధర్
15. హైదరాబాద్: మస్కతి/ మరో మహిళ పేరు పరిశీలన
16. వరంగల్: డీ సాంబయ్య / బలమైన నేత కోసం ఎదురుచూపు
17.ఆదిలాబాద్: పార్టీకి చెందిన సీనియర్ నేత

 

ఇదిలా ఉంటే చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసే సునీతా మహేందర్ రెడ్డి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

 

పట్నం సునీతామహేందర్ రెడ్డి

పట్నం సునీతారెడ్డి
(వికారాబాద్ జడ్పి చైర్ పర్సన్)
పుట్టిన తేదీ: 25నవంబర్1974

విద్యార్హతలు:గ్రాడ్యుయేషన్

పుట్టిన ఊరు:
గ్రామం: డాకూర్, ఆందోల్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా

తల్లిదండ్రులు
ప్రభుగారి రాజమణి, గోపాల్ రెడ్డి

సోదరులు
కృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి
సోదరీమణులు
సులోచన రెడ్డి, సురేఖ రెడ్డి
——————-
వివాహం
16 జులై 1995
పట్నం మహేంధర్ రెడ్డి తో
(మాజీ మంత్రి, ఎమ్మెల్సీ)

పిల్లలు
మనీషారెడ్డి, రినీష్ రెడ్డి

స్వగ్రామం
గొల్లూరి గూడ, షాబాద్ మండలం, చేవెళ్ల నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా

◆రాజకీయ అరంగేట్రం
2006లో(TDP)లో చేరిక
2006(TDP), 2014(BRS), 2019(BRS) పార్టీల తరుపున బంట్వారం, యాలాల, కోట్ పల్లి మండలాల నుంచి జడ్పిటీసీగా విజయం

2006, 2014, 2019లో వరుసగా హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ గా ఉమ్మడి రాష్ట్రంలో రికార్డు
(రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు, ప్రస్తుతం వికారాబాద్ జిల్లా జడ్పి చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు)

2013లో బీఆర్ఎస్ లో చేరిక
16 ఫిబ్రవరి 2024లో కాంగ్రెస్ లో చేరిక
ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ