వైద్య విద్యార్థి ఘటన నింధితులను శిక్షించాలి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ

0
148 Views

వికారాబాద్: కలకత్తాలో వైద విద్యార్ధిపై జరిగిన సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ కార్యక్రమంలో భాగంగా శనివారం వికారాబాద్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వైద్యులు విధులు బహిష్కరించి వైద్యులు , ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు మహావీర్ మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి పట్టణంలో ఆలంపల్లి నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ. వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారం హత్య ఘటనకు సంబంధించిన నిందితులను వెంటనే శిక్షించాలని వైద్యులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సంఘటనకు కారకులైన వారు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని ఆయా ఆసుపత్రిల వైద్యులు, బిజెపి నాయకులు, వ్యాపారులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు