12 గంటల్లో దొంగలించిన కారును గుర్తించిన పోలీసులు…. తాండూరు పోలీసుల పనితీరుపై హర్షం

0
16 Views

తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీసులు దొంగలించిన కారును 12 గంటల్లోనే ఆచూకీ తెలుసుకొని కారును స్వాధీనం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలు. తాండూర్ మండలం చెన్ గెస్ పూర్ గ్రామానికి చెందిన బంటు అంజయ్యకు చెందిన కారు TS 34D 9206 షిఫ్టు డిజైర్ బుధవారం రాత్రి 7 గంటలకు తాండూర్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌకర్ పేట్ సమీపంలో పార్కింగ్ చేశాడు. పార్కింగ్ చేసిన అనంతరం ఓ శుభకార్యం కోసం ఫ్రెండ్స్ తో కలిసి అంజలయ్య వెళ్లిపోయాడు. అనంతరం తిరిగి వచ్చి చూసేసరికి కారు లేకపోవడంతో అంజలయ్య రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు దర్యాప్తులో భాగంగా సిసి పుట్టేసిన పరిశీలించిన పోలీసులు ఒక గుర్తు తెలియని వ్యక్తి కారు ను దొంగిలించినట్లుగా గుర్తించారు. దీంతో కారు ఎటువైపు వెళ్లిందని కోణంలో పోలీసులు పరిశీలించగా పట్టణంలో ఉన్న సిసి ఫుటేజ్ ఆధారంగా కారు కూకట్ రోడ్డు మార్గంలో వెళ్లినట్లుగా నిర్ధారించుకున్న పోలీసులు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు గాలింపు చర్యలు చేపట్టారు దీంతో కొకట్ గ్రామ రోడ్డు మార్గంలో కారుని గుర్తించిన పోలీసులు కారుని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలిసిన వ్యక్తి కారు దొంగలించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 12 గంటల వ్యవధిలోని కారును గుర్తించడం పట్ల పోలీసుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.