భూగర్భ జలాలను పెంపొందించే వర్షపు నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది:కేంద్రీయ భూగర్భ జల బోర్డు రీజనల్ డైరెక్టర్ కృష్ణమూర్తి

0
17 Views

వికారాబాద్:భూగర్భ జలాలను పెంపొందించే వర్షపు నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రీయ భూగర్భ జల బోర్డు రీజినల్ డైరెక్టర్ జి. కృష్ణమూర్తి అన్నారు.గురువారం కలెక్టరేట్ జిల్లా సమాఖ్య భవనంలో భూగర్భ జలాల సమస్యలు, నిర్వహణపై ఉపాధి హామీ క్షేత్రస్థాయి అధికారులకు ఎవరు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజినల్ డైరెక్టర్ మాట్లాడుతూ… వర్షాల ప్రభావం వల్ల ఉపరితల జలం మానవ అవసరాలకు సరిపోవడం లేదన్నారు. ప్రతి నీ బిందువును ఒడిసిపట్టేందుకు చెక్ డాను నిర్మాణాలు పెద్ద మొత్తంలో చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.డిఆర్డిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు చురుగ్గా పాల్గొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు తగు కార్యాచరణలను చేపట్టాలని ఆయన తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పెద్ద మొత్తంలో చెరువులు కుంటల్లో వర్షపు నీరు వచ్చే విధంగా కాలువల ఏర్పాట్లకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో భూగర్భ జలాల శాస్త్రవేత్తలు రాణి వి.ఆర్, డాక్టర్ సుధీర్ కుమార్, టీ.మాధవ్ అథర్వ పవర్, యాదయ్య, శరత్ లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.