ప్రజాపాలన భాగంగా మహాలక్ష్మి పథకం ధరఖాస్తులు క్షేత్రస్ధాయిలో పరిశీలన చేసి పారధర్శకంగా పూర్తిచేయాలి:జిల్లా అధనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
25 Views

వికారాబాద్:ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పధకం క్రింద ప్రజలు సమర్పించిన ధరఖాస్తులలో తప్పిదాలను సవరించేందుకు నియమించిన టీములన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన గావించి పారదర్శకంగా పనులను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో మరియు నారాయణపూర్ గ్రామ పంచాయతీలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పర్యటించి ఆన్ లైన్ నమోదు ప్రక్రియ పనులను పరిశీలించారు. 500 లకే ఎల్ పి జి గ్యాస్ కనెక్షన్ అందించాలానే సంకల్పంతో ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని యాప్ లో ఆన్ లైన్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. చేపట్టిన పనులలో తప్పులు దొరలకుండా వేగవంతంగా ఈ నెల 10 వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ లలో పనులను పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా దరఖాస్తులో గ్యాస్ ఏజెన్సీ పేరు, కన్స్యూమర్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ వంటి వివరాలను సరిగా పొందు పరచాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరు నష్టపోకుండా తప్పులను సరి చేయాలని సూచించారు. అన్ని మండలాల పరిధిలో ఎంపీడీఓ లు, తహశీల్దార్లు, మున్సిపల్ పట్టణాలలో మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారుల నేతృత్వంలో గ్రామ, మునిసిపల్ స్థాయిలో ప్రత్యేక టీమ్ లను పనిచేస్తున్నాయని తెలిపారు. తప్పులు దొరలకుండా రికార్డులను ఇంటింటికి వెళ్లి పరిశీలించుకొని ఆన్ లైన్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, ఎంపీఓ నాగరాజు, మున్సిపల్ టి పి ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.