ఒక్కో వైన్ షాపుకు అదనపు టార్గెట్ 50 లక్షలు.. తలలు పట్టుకుంటున్న మద్యం వ్యాపారులు

0
365 Views

అనంతగిరి డెస్క్: గతంలో ప్రతిపక్షంలో  ఉన్న కాంగ్రెస్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ చేశాడని ప్రచారం చేసి మేము అధికారంలోకి రాగానే గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులను తొలగిస్తామని ఇప్పుడు అదే కాంగ్రెస్  ప్రభుత్వం మధ్యం ఎక్కువగా అమ్మించాలని అధికారులపైనే ఒత్తిడి తెస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారులు గతంలో ఎప్పుడూ చూడని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్లు చేరుకోవాలనే ఒత్తిడి, ప్రత్యేకించి ఎక్సైజ్ శాఖ అధికారుల నుండి, మద్యం దుకాణదారులను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తోంది. మూసుకున్న టార్గెట్లను చేరుకోవాలని, ముఖ్యంగా నెలాఖరులోపు, ప్రభుత్వం నుండి ఫోన్లు రావడం వ్యాపారులకు తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల వల్ల వాణిజ్యవేత్తలు తీవ్ర నిరాశతో ఉన్నారు. తమ షాపులకు రూ. 20 లక్షల నుండి రూ. 50 లక్షల మేరకు అదనపు మద్యం కొనుగోలు చేసి, అమ్మాలన్న అధికారుల ఒత్తిడి భరించడం చాలా కష్టమని మద్యం వ్యాపారులు అంటున్నారు. ఇంతటి అదనపు ఒత్తిడి ముందు ఎన్నడూ ఎదుర్కోలేదని వారు గగ్గోలు పెడుతున్నారు.

ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, తమ వ్యాపారం నష్టాల్లోకి జారిపోతుందని, దీనిపై తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.