ప్రకృతిని దేవతగా పూజించే గొప్ప పండగా ‘బతుకమ్మ ‘ ప్రకృతిని పలకరించే ‘‘బతుకమ్మ’’

0
89 Views

వికారాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రజల సాంస్కృతిక ప్రతీకగా ‘బతుకమ్మ’ పండుగ ప్రసిద్ధి చెందింది. ప్రకృతిని దేవత గా భావించి ఈ పండుగను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి మహాలయ అమావాస్య నుండి మొదలుకుని తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. దసరా పండుగకు రెండురోజుల ముందు ఈ బతుకమ్మ జాతరను నిర్వహించుకుంటారు. పండుగ నేడు ఎంగిలి పూల బతుకమ్మ నుండి ఈ నెల 10 సద్దుల బతుకమ్మ అని జరూపుకోబోతున్నారు . అదేవిధంగా దసరా పండుగకి ముందు కలిసి రావడంతో ఈ రెండు పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇందులో బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణ వాళ్లకు మాత్రమే చాలా ప్రత్యేకమైంది. ఈ పండుగ శీతాకాలంలో తొలిరోజులలో రావడం వల్ల వాతావరణం పూలతో, నీటితో కొలువై వుంటుంది. అలాగే రకరకాల పండ్లు, పూలు కూడా ఈ కాలంలోనే చాలావరకు వీస్తాయి. ముఖ్యంగా ఇందులో బంతి, చేమంతి, గునుగు లాంటి చాలా ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ఈ రంగురంగుల పువ్వులతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.
ఘనంగా బతుకమ్మ సంబరాలు….

వికారాబాద్ పట్టణం లోని సిద్ధార్థ స్కూల్ లో బుధవారం చాలా సందడిగా జరుపుకున్నారు. విద్యా శాఖ ఆదేశాల మేరా బుధవారం నుండి ఈ నెల 14వరకు దసరా సెలవులు ప్రకటించడంతో బతుకమ్మ తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ప్రారంభించినట్లు పాఠశాల యాజమాన్యం వేణు గోపాల్ రావు, బదరినాథ్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రిన్సిపాల్ మంజుల జాదవ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి పిల్లలకి మన సంస్కృతి, సంప్రదాయాలు అలవాటు కావాలి,స్త్రీ శక్తి బతుకమ్మ
బతుకమ్మ పండుగ త్యాగాల నేపథ్యం నుంచి పుట్టింది. అందుకే బతుకమ్మ పాటలు చాలావరకు త్యాగానికి సంబంధించినవే ఉంటయి. ప్రాచుర్యంలో ఉన్న ప్రతీ కథలోనూ బతుకమ్మ ఆత్మబలిదానం చేసుకుంటుంది. చెరువు గండి పూడ్చడం, ఊరిని కాపాడటం.. ఇలా ప్రతి కథ నేపథ్యంలోనూ ఆడబిడ్డల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే ఉంటుంది. అందుకే బతుకమ్మను మహాలక్ష్మి అవతారంగా చెప్తుంటరు. బతుకమ్మ అంటే స్త్రీ శక్తిగా కొనియాడుతరు. అందుకేనేమో ఎప్పుడూ లేనంత సంతోషంగా, ఎన్నడూ చూడనంత శోభాయమానంగా ఆడబిడ్డల మొఖాలు బతుకమ్మనాడు కనిపిస్తుంటయి. అప్పుడు, ఆ క్షణాన వాళ్ల పాటల్లో స్వచ్ఛమైన హృదయం ప్రతిబింబిస్తది. ఇప్పుడు ప్రారంభమే బతుకమ్మతో చేస్తున్నంగానీ పూర్వం పూజ బొడ్డెమ్మతో పండుగను మొదలుపెట్టేటోళ్లు. పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మను చేసి పెత్తరమాసనాడు బతుకమ్మ పండుగను మొదలుపెట్టి తొమ్మిదిరోజుల తర్వాత ‘ఘనమైన పొన్నపువ్వే గౌరమ్మా.. గజ్జెలా వడ్డాణమే గౌరమ్మా’ అని ఘనంగా సాగనంపే సంస్కృతి ఈ పండుగకు ఉంది అన్నారు.