ఎర్రవల్లి గ్రామంలో దారుణం ఇంట్లో ఉరి వేసుకుని మహిళ మృతి

0
23 Views

వికారాబాద్ : ఉరి వేసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిమ వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కొంపల్లి సురేష్ తో సిద్దులూర్ గ్రామానికి చెెందిన సబితాతో వివాహాం మూడ సంవత్సరాల క్రితం జరిగింది.  సురేష్ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఇదిలా ఉంటే శనివారం రాత్రి సబితా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భర్త్త్తతో పాటు అత్త ను పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.