ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన సేవ కేెంద్రాలు:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 

0
61 Views
వికారాబాద్: జిల్లా లో  ప్రజాపాలన సేవ కేంద్రాలు  ప్రతి గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేశామని,  ప్రజా పాలన  పై వచ్చిన  దరఖాస్తులపై దృష్టి సారించి  క్షుణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  ఆదేశించారు.శుక్రవారం జిల్లాలోని ఎంపీడీవో,  ఎంపీవోలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ  సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో 566  గ్రామ పంచాయతీలలో  ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవ కేంద్రాలకు వచ్చిన  ప్రజలు ఏ ఒక్కరిని కూడా రిటన్ పంపరాదని, వారి యొక్క గ్యాస్ సిలిండర్ కనెక్షన్  కోసం  రేషన్ కార్డ్, ఆదార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ , ఫోన్ నెంబర్    తీసుకొని ఏదైనా సమస్య ఉంటే క్లియర్ చేయాలన్నారు. ఎవ్వరిని కూడా తిరిగి పంపరాదని ఆదేశించారు.    ప్రజాపాలన యాప్ లో  రేషన్ కార్డ్స్ ఎంత మందికి మ్యాచ్ అయినవి, మ్యాచ్  కానివి ఇంకా ఎన్ని ఉన్నాయని మండలం వారిగా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లా లో ఉండే అంగన్ వాడి సెంటర్ల  బిల్డింగ్స్ కు పెయింటింగ్ , త్రాగు నీరు, టై లెట్స్ పూర్తి చేయాలనీ, నర్సరీ లలో  నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలనీ ,     పనులన్నింటిని పెండింగ్ ఉండకుండా పూర్తి చేయాలనీ ఆదేశించారు.  మిషన్ భగీరథ వాటర్  ప్రతి సెంటర్ లో ఉండేలా ఏర్పాటు  చేయాలని ఆదేశించారు. అదే విధంగా లైట్స్ ఫ్యాన్స్   ఏర్పాటు చేయాలనీ  అన్నారు. ఏం పీ డి ఓ లు  ,మున్సిపల్ కమిషనర్ ల వల్ల జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందని ఈ సందర్బంగా వారిని అభినందించారు.
ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా జాబ్ కార్డ్స్  ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.  గ్రామాలలో నిరంతరం పారిశుద్యం  మెరుగు పరుస్తూ పరిశుభ్రంగా ఉండేలా   శానిటేషన్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సు లో  అదనపు కలెక్టర్ సుదీర్, డీఆర్డీఏ శ్రీనివాస్,  మిషన్ భగీరథ ఈఈ చల్మా రెడ్డి ,  శిశుసంక్షేమ శాఖా అధికారి కృష్ణ వేణి, సంబంధిత అధికారులు తదితరులు  పాల్గొన్నారు.