స్వరాష్ట్ర తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ప్రత్యేక నిధులు: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

0
12 Views

వికారాబాద్: స్వరాష్ట్ర తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ప్రత్యేక నిధులు అందుతాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం “మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా *మర్పల్లి* మండల పరిధిలోని *బిల్కల్* గ్రామంలో  పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల నిధులు మంజూరు చేస్తూ… అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంబాలకు విద్యుత్ తీగలు వెంటనే ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా అందించాలని, గ్రామంలో మరియు పంటపొలాల్లో పలు చోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, విద్యుత్ శాఖ వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ… సేవలందించాలన్నారు. గ్రామంలో ప్రతి మంగళవారం పశువుల డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని పశు వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలో పాడబడ్డ ఇళ్ళు మరియు పిచ్చి మొక్కలు, పాత బావులు పల్లె ప్రగతిలోని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.  గ్రామంలో 4వ వార్డు మరియు 7వ వార్డులో నీరు కొరతగా వస్తుందని తెలుపగా… ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, మిషన్ భగీరథ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ… ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని, ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో అవసరమైన చోట రోడ్లు మరియు మురుగు కాలువలు నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.