15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ  మెదడు వాపు వ్యాధి సోకకుండా జేఈ వ్యాక్సినేషన్: జిల్లా కలెక్టర్ నిఖిల

0
18 Views

వికారాబాద్: జిల్లాలో ఒకటి నుండి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ  మెదడు వాపు వ్యాధి సోకకుండా J E ( జపనీస్ ఎన్సపాలిటీస్ ) వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు  జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు.బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు లో (JE)వాక్సినేషన్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక సంవత్సరం నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ  జేఈ టీకా ఇవ్వడానికి సంబంధిత శాఖల అధికారులు  కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.  ఒకటి నుంచి 15 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ మున్సిపల్ పరిధిలో, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలలోని పాఠశాలల్లో వ్యాక్సినేషన్ వేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.  ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో పాటు, పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలందరికీ టీకాలు వేసే విధంగా నోడల్ అధికారులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో ఒకటి నుండి పదిహేను సంవత్సరాల వయస్సు గల  పిల్లలు 179619 మంది ఉన్నాట్లు తెలిపారు.    మెదడు వాపు వ్యాధి పందులు, పక్షులు, క్యూలెక్స్ దోమల ద్వారా  15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకు సోకుతుందని, ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు JE టీకా సుమర్తవంతంగా పనిచేస్తుందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలతో పాటు, పిల్లల తల్లిదండ్రులకు వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు నిర్వహించే గ్రామ సభలలో అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్, డాక్టర్ మారియా, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, డివిజన్ పంచాయతీ అధికారి అనిత, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.