కే జీ బీవి వర్కర్స్ ను పర్మినెంట్ చేసి సమస్యలు పరిష్కరించాలి.: రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంట నాగయ్య,వై.గీత

0
18 Views

హైదరాబాద్:కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ వర్కర్స్ ను పర్మినెంట్ చేస్తానన్న కేసీఅర్ హామీని కేజీబీవీ లలో పని చేస్తున్న ఏడు వేల మందికి వర్తింప చేయాలని తెలంగాణ ప్రగతిశీల kgbv నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంట నాగయ్య,వై.గీత అన్నారు. స్థానిక మార్క్స్ భవన్ లో తెలంగాణ ప్రగతిశీల kgbv నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం గంట నాగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో KGBV వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చర్చించారు.  ఈ సందర్భంగా గంట నాగయ్య, వై.గీత లు పాల్గొని మాట్లాడుతూ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా ఉందని కేసీఆర్ ప్రభుత్వం చెప్తుంది, కానీ ఆచరణలో కన్పించడం లేదని అన్నారు. ఒడిస్సా ప్రభుత్వం కాంట్రాక్ట్ వర్కర్లను 57 వేల మందిని పర్మినెంట్ చేస్తానని చెప్పారు,తెలంగాణలో 11 వేల మందికి పరిమితం అయ్యి చేతులు దులుపుకొందని అన్నారు. రాష్ట్రంలో కేజీబీవీ లలో విద్యార్థులకు ఎనలేని సేవలు అందజేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని , శ్రమకు తగిన,నేటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. కేజీబీవీ లలో అప్ గ్రేడ్ అయిన తర్వాత నాన్ టీచింగ్ వర్కర్స్ ను నియమించకపోవడంతో పని భారం పెరిగి, పని ఒత్తిళ్లకు గురవుతున్నారని తక్షణమే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఎప్పటికైనా జీతాలు పెంచుతారనీ, పర్మినెంట్ చేస్తారని ఎంతో శ్రమ చేస్తున్న కే జి బి వి వర్కర్లకు కనీసం గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవని, ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు చేశారు. జనవరి 11న హైదరాబాదులో కేజీబీవీ అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిర్వహిస్తున్నట్లు దీనికి ముందు అన్నీ జిల్లాల్లో మహాసభలు జర్పుకోవలని పెద్ద ఎత్తున కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో IFTU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణ, తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రఫియా,బాలమని,శమంత, శోబా, పద్మ,లింగంపల్లి వజ్రమ్మ,నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు