2022-23 ఖరీఫ్, రబీ కాలం మిగులు సిఎంఆర్ బియ్యాన్ని ఎఫ్ సి ఐ కి వెంటనే డెలివరీ చేయాలి: జిల్లా ఆదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0
24 Views

వికారాబాద్:2022-23 ఖరీఫ్, రబీ కాలం మిగులు సిఎంఆర్ బియ్యాన్ని ఎఫ్ సి ఐ కి వెంటనే డెలివరీ చేయాల్సిందిగా జిల్లా ఆదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులతో సిఎంఆర్ రైస్ డెలివరీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్, రబీ మిగులు సిఎంఆర్ బియ్యాన్ని ఈనెల 29 వరకు ఎఫ్ సి ఐ కి డెలివరీ చేయాలని ఆదేశించారు. ఇట్టి అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని వెంటనే బియ్యం ఎఫ్ సి ఐ కి అందజేయాలని అన్నారు. మిల్లర్లు ఎవరైనా రీసైక్లింగ్ పాల్పడినట్లయితే వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దారులు తమ పరిధిలోని మిల్లర్లను సంప్రదించి వారి సామర్థ్యం ప్రకారం సీఎంఆర్ డెలివరీ అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. మిల్లులలో ప్రస్తుతం నిల్వ ఉన్న ధాన్యాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కొండల్ రావు, డిప్యూటీ తహసిల్దార్లు, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలేశ్వర గుప్తా, శ్రీధర్ రెడ్డి, మిల్లర్ల యాజమాన్యులు పాల్గొన్నారు.