కొత్తగాడి గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
23 Views

వికారాబాద్:స్థానిక కొత్తగడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 300 మంది విద్యార్థులు జాండీస్ సోకి అస్వస్థతకు గురైనట్టు తెలిసిన వెంటనే గత మూడు రోజులుగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం రోజున కొత్తగాడి గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణ, విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అవసరమైన టెస్టులు, వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జాండీస్ కారణంగా కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురైనట్లు తెలుపుతూ, చాలా మంది విద్యార్థులు ఆరోగ్యం మెరుగుపడిందని అందులో 61 మంది చికిత్సల అనంతరం వారు తమ ఇండ్లకు వెళ్లినట్లు తెలిపారు. మరో 12 మంది విద్యార్థులు కడుపు నొప్పి సమస్యలు ఉన్న వారికి వైద్య శాఖ ఆధ్వర్యంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. మిగతా విద్యార్థులు అందరూ కోలుకున్నట్లు తెలియజేశారు. పాఠశాలలో స్వచ్ఛమైన త్రాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత పట్ల మున్సిపల్ వైద్యశాఖల ఆధ్వర్యంలో తక్షణ చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అందరూ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.