రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదలను నివారించవచ్చు:జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

0
28 Views

వికారాబాద్:రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదలను నివారించవచ్చు అని
జిల్లా ఎస్‌.పి  N.కోటి రెడ్డి అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్బంగా బుదవారం  జిల్లా లోని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో వాహనదారులకు రోడ్డు రవాణా పైన అవగాహన కల్గించడం జరిగింది. రోడ్డు భద్రత వారోత్సవాలు నేటి తో ముగియడం జరుగుతుంది.రోడ్డు నియమాలను ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే రోడ్డు ప్రమాదలను నివారించవచ్చు అని, ఒక్కరి నిర్లక్ష్యం ఒకరికి శాపం గా మారుతుంది.రోడ్డు ప్రయాణం లేకుండా మనషి మానగడ లేదు, మనషి ఉదయం లేచిననుండి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరికీ రోడ్డు తో లేనిదే జీవనం లేదు. జీవితం లో ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి రోడ్డులను మనం సక్రమంగా, రోడ్డు భద్రత విద్యా ను పాటించకుండా ఉపయోగించుకున్నట్లు అయితే రోడ్డు లు యమపాసలు గా మరే అవకాశం ఉంది. కావున కుటుంబ సభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టి పిల్లలు,ఉద్యోగులు, డ్రైవర్లు మొదలగు వారు బయటకు వెళ్ళే సమయం లో రోడ్డు భద్రత నియమాలు తప్పని సరిగా పాటించేటట్లు చూడాలని జిల్లా ఎస్‌పి గారు తెలిపినారు. మైనర్ పిల్లలకు తల్లితండ్రులు ఎట్టి పరిస్థితిలో వాహనాలు ఇవ్వకూడదు. మైనర్ పిల్లలు వాహనాలతో పట్టుబడితే తల్లితండ్రుల పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇచ్చినట్లు అయితే అ యజమానుపైన కూడా చట్టప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అని, ద్వి చక్ర వాహనదారులు హెల్మెట్ మరియు 4 వీలర్స్ అ పై వాళ్ళు తప్పని సరిగా సీట్ బెల్ట్ పెట్టుకొనే వాహనాలు నడపాలి. డ్రంక్ & డ్రైవ్ చేయకూడదు చేసిన వారికి కఠినమైన చర్యలు తీసుకుకోవడం జరుగుతుంది. వాహనాలు నడిపే వారి దగ్గర అన్నీ రకాల పత్రాలు కల్గిఉండాలని, తల్లితండ్రులు పిల్లలకు వాహనాలు ఇప్పించే ముందు వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలి. ప్రతి యొక్కరు రోడ్డు భద్రత విద్యా యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని అవగాహన కల్పించుకొని రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగం కావాలని జిల్లా ఎస్‌పి  తెలిపారు.