చీమలదరి మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డికి ఆరుదైన అవకాశం

0
29 Views

వికారాబాద్:తన గ్రామాన్ని దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చినటువంటి తాజా మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి గారికి ఢిల్లీలో ప్రధానమంత్రి తో కలిసి కూర్చొని భోజనం చేసే అవకాశం లభించిందివివరాలకు వెళితే గత సంవత్సరం 2023 రోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి గ్రామపంచాయతీ గా ఎన్నిక చేస్తూ ప్రధానమంత్రి సంసాత్ గ్రామ యోజన కింద ఢిల్లీలో అవార్డు లభించడం జరిగింది. అప్పటినుంచి ఆ మారమూల గ్రామాన్ని దేశంలో ఉన్నటువంటి మారుమూల రాష్ట్రాల నుంచి మరియు అంతర్జాతీయంగా కూడా డెలిగేట్స్ వచ్చి సందర్శించడం ప్రశంసించడం జరిగింది. తర్వాత రెండు రోజుల క్రితం కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఏకంగా ఆ గ్రామాన్ని సందర్శించి దేశంలోనే అత్యున్నతమైనటువంటి డిజిటల్ గ్రామంగా గుర్తించడం జరిగింది. అందుకుగాను నరసింహారెడ్డి  చేసినటువంటి కృషిని అభినందిస్తూ నరసింహ రెడ్డి కి సంబంధించినటువంటి సమాచారాన్ని భారతదేశ ప్రధానమంత్రికి చెప్పడం ,తర్వాత ప్రధానమంత్రి  సంతోషిస్తూ స్పందిస్తూ ఆ సర్పంచ్ ను నా దగ్గరికి తీసుకురండి తనతో ఒక పూట భోజనం చేయాలనుకుంటున్నాను అని తన ఆకాంక్షను తెలియజేసినాడు. అట్టి విషయాన్ని కేంద్రం మంత్రి నరసింహ రెడ్డి కి చెప్పగా వచ్చేవారం ప్రధానమంత్రి అబూదాబి నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రధానమంత్రి తో కలిసి గ్రామ సమస్యల మీద గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటటువంటి అంశం మీద భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ అభివృద్ధి శాఖ లో నరసింహారెడ్డి  సేవల్ని వినియోగించుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది ఇట్టి విషయమై త్వరలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పీఎంఓ నుంచి ఒక ప్రకటన వెలువడనుంది