పిల్లలకు చదువుతోపాటు ఆటలు ముఖ్యం: బచ్పన్ ప్లే స్కూల్ వార్షికోత్సవంలో ప్రొఫెసర్ ఎమ్ఎల్ సాయికుమార్

0
29 Views

వికారాబాద్ : పిల్లలకు ఆటలు జనరల్ విషయాలపై అవగాహన కలిగిస్తూ చదువు అందిస్తే నైపుణ్యం మైన విద్యను నేర్చుకుంటారని ప్రొఫెసర్ ఎమ్ఎల్ సాయికుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని బచ్పన్ ప్లే స్కూల్ పాఠశాల డైరెక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన యాన్యువల్ డే సెలబ్రేషన్ కార్యక్రమానికి ప్రొఫెసర్ ఎం.ఎల్ సాయికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లలకు ఒక గంట చదివిస్తే ఒక గంట ఆటల కోసం సమయం ఇవ్వండి ఒక గంట కబుర్లు చెబుతూ గడపాలని సూచించారు. ఇతర విషయాలు పక్కన పెట్టి కేవలం చదువుపై మాత్రమే దృష్టి పెడితే ఒత్తిడికి గురవుతారని దీంతో వారి మానసిక వికాసం పై దెబ్బ పడుతుందని హెచ్చరించారు. ఉద్యోగాలు ఎన్ని ఉన్నా పరీక్షలలో ఆన్సర్ చేయలేకపోవడానికి నైపుణ్యం లేకపోవడమే కారణమని అన్నారు. ఒత్తిడి లేని విద్యను అందించడంతోపాటు క్రమశిక్షణ అందించడం ముఖ్యమన్నారు. తల్లి తండ్రి గురువుల ప్రాముఖ్యత తెలియజేసి వారిపై గౌరవం పెంపొందించాలన్నారు. కుటుంబ పోషణ పిల్లల భవిష్యత్తుపై తండ్రి పడే ఆరాటం వేల కట్టలేనిది అన్నారు. ఆంక్షల క్రమశిక్షణతో పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి కుటుంబ పెద్దగా తండ్రి ఆరాటపడుతాడు అని అన్నారు. నైపుణ్యత కూడిన విద్య అందించి మెరుగైన సమాజాన్ని తయారు చేయడంలో తల్లి గురువుల పాత్ర ముఖ్యమైనదని గుర్తు చేశారు. అంతకు ముందు పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా ప్రశాంతి,  విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.