వికారాబాద్ కు చెందిన మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలి:   స్పీకర్ ప్రసాద్ కుమార్ 

0
156 Views

వికారాబాద్:  వికారాబాద్ నియోజకవర్గంలోని అత్యంత ముఖ్యమైన మూడు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని   స్పీకర్ ప్రసాద్ కుమార్  కోరారు. మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి   నితిన్ గడ్కరీ ని అధికార నివాసంలో చేవెళ్ల MP కొండా విశ్వేశ్వరరెడ్డి, పెద్దపల్లి MP గడ్డం వంశీ కృష్ణ, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ లెజిస్లేటివ్ సెక్రటరీ డా వి నరసింహా చార్యులు, స్పీకర్ గారి OSD పి. వెంకటేశం, నాయకులు మాణిక్ రెడ్డి లు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్  తో కలిసి నితిన్ గడ్కరీ ని కలిసారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 7 రోడ్లకు Central Road Infrastructure Funds Scheme (CRIF) పరిధిలో నిధులను మంజూరు చేసి నిధులను విడుదల చేయాలని  స్పీకర్ కోరారు.

● జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరినవి…

1. కోకాపేట ORR జంక్షన్- శంకరపల్లి-మోమిన్ పేట- మర్పల్లి- బుదేరా రోడ్డు (80KMs).

2.తాండూరు-పెద్దముల్-కోటపల్లి-మోమిన్ పేట-సదాశివపేట రోడ్డు (63.20KM)

3. వికారాబాద్-మోమిన్ పేట రోడ్డు (19.60 KM).

● CRIF పథకం క్రింద నిధులు మంజూరు చేయాలని కోరినవి..

1. తాండూరు-దారూరు రోడ్డు (Rs. 45 కోట్లు).

2. కొత్తగడి -బంట్వారం రోడ్డు (Rs. 50 కోట్లు).

3. కేసారం -తురమామిడి రోడ్డు (Rs. 60 కోట్లు)

4. వికారాబాద్ -ధారూర్ రైల్వే స్టేషన్ రోడ్డు ( Rs.55 కోట్లు).

5. బషీరాబాద్ -మైలావర్ రోడ్డు (Rs. 35 కోట్లు).

6. మారేపల్లి- మదనాంతపూర్ రోడ్డు (Rs. 40 కోట్లు)

7. PWD రోడ్డు నుండి బంట్వారం (వయా రాంపల్లి) (Rs. 30 కోట్లు).