మన ఊరు మనబడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి

0
17 Views

వికారాబాద్ : జిల్లా లో మన ఊరు మన బడి క్రింద చేపట్టిన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు.
మంగళ వారం ఉదయం టెలి కాన్ఫరెన్సు ద్వారా జిల్లా లో జరిగే మన ఊరు మనబడి క్రింద చేపట్టిన పెండింగ్ పనులను పూర్తిచేయాలనీ, సి సి రోడ్ల నిర్మాణ పనులు మరియు మన ఊరు మన బడి పాఠశాలలకు అవసరమయ్యే పనులను పెండింగ్లో ఉంచకుండా 100% పనులు పూర్తి చేసి ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ , పాఠశాలలలో ఇంకా ఏ ఏ పనులు మిగిలి ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ క్రింద పాఠశాలలలో చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి నివేదిక పంపాలన్నారు. ఇంజనీర్లు , డి ఇ లు నిర్మాణ పనులలో జాప్యం జరుగకుండా ప్రతి రోజు జరగాల్సిన పనులకు ఎన్ని మిల్లర్లు, ఎంత మంది లేబర్ ఉంటె పనులు త్వరగా పూర్తి చేయవచ్చు అనే విదంగా ముందుకెళ్ళాలని , అంచనా ప్రాకారము పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. సి సి రోడ్ల నిర్మాణ పనులు జరిగిన వాటికీ తప్పని సరిగా ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతి బిల్డింగ్స్, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్, టైలెట్స్, నిర్మాణ పనులు ఏవైతే ముందే ప్రారంభించి పూర్తి కాని పనులను సత్వరమే పూర్తి చేసి , పూర్తి అయిన వాటికీ తప్పని సరిగా ఎఫ్ టి ఓ జనరేట్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. టెలి కాన్ఫరెన్సు లో ఈ ఈ ఆర్ అండ్ బి , డి ఇ ఓ , పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు డి ఇ లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.