సమాజ సేవ పౌరులుగా గుర్తింపు పొందాలి: – అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బాలచంద్ర

0
25 Views

– ఎస్ ఎల్ బి లో జూనియర్ కళాశాల డార్మెటరీ హాల్ ప్రారంభం
– దాతలకు ఘన స్వాగతం, అలరించిన ఎస్ఎల్బీ విద్యార్థినిలు

వికారాబాద్: విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి సమాజసేవ పౌరులుగా కీర్తి పొందాలని అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ బాలచంద్ర అన్నారు. అభయ ఫౌండేషన్ అలాగే తెలంగాణ రాష్ట్ర గురుకుల సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన సంగం లక్ష్మీబాయి గురుకుల బాలికల కళాశాల డార్మెట్రిహాలు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అభయ ఫౌండేషన్ అలాగే దాతలు రీగల్ రీగల్ రెక్స్ నార్డ్ ప్రతినిధులు అనిర్థా పాటిల్, విజయ్ కుమార్ లకు ఘనంగా స్వాగతం పలికారు. అభయ ఫౌండేషన్, రీగల్ రెక్స్ నార్డ్ మరియు సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రూ. 35 లక్షలతో నిర్మించిన డార్మెట్రిహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దాతలు అభయ ఫౌండేషన్ వారు విద్యార్థినిలకు చదువు ప్రాధాన్యతను సమాజ సేవ గురించి ఆసక్తికరంగా వివరించారు. సమాజంలో అత్యవసరం ఉన్న వారికి సేవలు అందించాలని, జీవితంలో మంచి పౌరులుగా ఎదగాలని, దుర్వ్యసనాలకు దూరంగా జీవించాలని తెలియజేశారు. విద్యార్థినులు ప్రదర్శించిన కళారూపాలు ప్రసంగాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. డార్మెట్రిహాలు నిర్మించడం పట్ల తమకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ, విద్యార్థినిలు, సిబ్బంది అభయ ఫౌండేషన్, రీగల్ రెక్స్ నార్డ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ రమణమ్మను దాతలు, సొసైటీ వారు అభినందించారు. మరిన్ని సేవాకర కార్యక్రమాలకు ముందు ఉంటామని హామీ ఇచ్చారు. జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి కళాశాల ప్రిన్సిపల్ సురభి చైతన్య, పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.