రైతులకు అండగా నిలవాలనే రణమాఫీ : మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్

0
38 Views

జహీరాబాద్:  రైతులకు అండగా నిలవాలనే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేయడం జరిగిందని మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ అన్నారు. గురువారం  రైతు రుణామాఫీ చెపట్టనున్న సందర్భంగా మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించి  మాట్లాడుతూ.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రాష్ట్రంలో తోంబై తోమ్మిది శాతం మంది రైతులకు రుణ మాఫీ చేయనున్నారు అని తెలిపారు. దేశానికి వేన్నుముక్క అయిన అన్నదాతను వేన్నుదన్నగా ఉండదెందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అని అన్నారు. ఆగస్టు 15 వ తేదీ లోపు రెండు లక్షల రూపాయలు రూపుమాఫీ చేస్తున్నారన్నారు. నెల రోజులు ముందుగానే హామీని నిలబేట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని అన్నారు . రుణ మాఫీకి ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం సహకరించక పొయినా రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినా మాటా నిలబెట్టుకుంది అని అన్నారు. ఈ సందర్భంగా జహిరాబాద్ నియోజకవర్గ రైతాంగం తరుఫున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి   కి మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి  , మక్సుద్  , ఉగ్గేల్లి రాములు  , మాజీ వైస్ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ , ఖాజా మీయ  తదితరులు పాల్గొన్నారు.