అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుండి టెండర్ల ఆహ్వానం : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
45 Views

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధిం అన్చి ఔట్సోర్సింగ్ సర్వీసులు ఏర్పాటు చేయడం నిమిత్తం రిజిస్ట్రేషన్ అయి ఉన్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు సీల్ టెండర్లు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ల డాక్యుమెంట్లను జిల్లా ఉపాధి కల్పనాధికారి నుండి జూలై 26 తేదీ లోపు కార్యాలయ పని దినాల్లో పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. అన్నారు. ఆసక్తి కల ఏజెన్సీల నుండి సీల్ టెండర్లను జూలై 20 నుండి 26వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సీల్ టెండర్లను జులై 27 ఉదయం 10:30 నిమిషాలకు అందుబాటులో ఉన్న ఏజెన్సీల సమక్షంలో జిల్లా కలెక్టరేటు సమావేశ మందిరంలో టెండర్లను తెరవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. టెండర్ ఫారాలు మరియు ఇతర సమాచార నిమిత్తం జిల్లా ఉపాధి కల్పనాధికారి ని ఫోన్ నెంబర్ 9177607016 ద్వారా సంప్రదించవలసిందిగా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు