నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి :  AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్

0
122 Views

వికారాబాద్ :  పూడూరు మండలంలోని దామగుండం ప్రాంతంలో గల ప్రశాంతమైన అడవి ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు వెంటనే నిలిపివేయాలని వికారాబాద్ జిల్లా AIKMS,POW, PDSU కమిటిల ఆధ్వర్యంలో పూడూరు లోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సేవ్ దామగుండం, సేవ్ వికారాబాద్ అంటూ నిరసన  తెలిపారు. ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్షుడు వై మహేందర్,PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ,AIKMS జిల్లా కార్యదర్శి మల్లేష్ ,POW జిల్లా కన్వీనర్ వై గీత లు మాట్లాడుతూ. దాదాపు 12,00,000 లక్షల చెట్లు వినాశనం చేస్తూ ఏర్పాటు చేసే రాడార్ స్టేషన్ వెంటనే నిలిపివేయాలని  డిమాండ్  చేశారు. భారత రాజ్యాంగంలో 48-A ఆర్టికల్ నిబంధనకు వ్యతిరేకంగా ఈ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారని, దానితోపాటు పర్యావరణ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఏర్పాటుకు సిద్ధమైన ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలన్నారు. కనీసం ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న వారి అభిప్రాయం తీసుకోకుండా, పర్యావరణ శాస్త్రవేత్తల పర్యవేక్షణ లేకుండా, ప్రశాంతమైనటువంటి అడవి సంపద కలిగిన దామగుండం ప్రాంతంలో పర్యావరణాన్ని వినాశనం చేయడానికి పూనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న పోరాటాల సిద్ధమవుతామని తెలిపారు. ఈ అడవి ప్రాంతం లో చాలా రకరకాల జంతువులు, రకరకాల పక్షులు, రకరకాల ఔషధ మొక్కలు కలిగి ఉన్న ఈ అడవి ప్రాంతంలో ఈ నేవీ రాడార్ ఏర్పాటు వల్ల ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ప్రకృతిని విద్వాంశం చేసే ఏ అభివృద్ధి కూడా సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా కార్యదర్శి రాజేష్,AIKMS జిల్లా నాయకులు రాములు, PDSU విద్యార్థి సంఘ నాయకులు జయపాల్, శ్రీకాంత్ అశోక్, సురేష్ ,ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.