వికారాబాద్ NTR చౌరస్తా లో నూతన TGSRTC మొబైల్ లాజిస్టిక్ కౌంటర్ ప్రారంభం

0
222 Views

వికారాబాద్:NTR చౌరస్తా వికారాబాద్ నూతన TGSRTC మొబైల్ లాజిస్టిక్ కౌంటర్ ప్రారంభంచండ జరిగిందని రంగారెడ్డి & నల్లగొండ లాజిస్టిక్ అధికారి రవీందర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ పట్టణ మరియు సమీప గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు. కౌంటర్ ఏజెంట్ గా B గోపాల్ ని నియమించినట్లు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు భాను ప్రసాద్, చంద్రయ్య తాండూర్ డిపో, విశ్వనాధ్ గౌడ్ పరిగి డిపో, వసంత్ వికారాబాద్ డిపో, బస్ పాస్ ఇంచార్జ్ గోపాల్ గారు, పరిగి పాయింట్ కంట్రోలర్ సులోచన గారు పాల్గొని ఈ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ వాసులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొని, ఇలాంటి సౌకర్యాన్ని కల్పించినందుకు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.