గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరు ఊరికో జమ్మి చెట్టు… గుడి గుడికో జమ్మి చెట్టు : రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

0
107 Views

వికారాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ రాజ్య సభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందన్నారు మాజీ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. గుడి గుడికో ఓ జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా.. వికారాబాద్ అనంతగిరి పద్మనాభ స్వామి, మూసీ జన్మస్థలం బుగ్గరామలింగేశ్వర స్వామి, మరియు పూడూరు మండలంలోని దామగుండం ఆలయ ప్రాంగణంలో వేద పండితులతో కలిసి శుభప్రద్ పటేల్ జమ్మి చెట్టు నాటారు. ఈ సంధర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. మాజీ ఎంపీ సంతోష్ కుమార్  ఊరు ఉరికో జమ్మిచెట్టు, గుడి గుడికో జమ్మిచెట్టు అనే అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వార ప్రతి గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి చెట్టు నాటడం జరుగుతుందని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమని ప్రతి ఒక్కరూగుడిలో, ప్రతి ఊరిలో జమ్మి మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆ స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని శుభప్రద్ పటేల్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో చైతన్య, కేదార్ నాద్ , దామగుండం జేఏసీ నాయకులూ సత్యానందా స్వామి వెంకటయ్య , సత్యం , నాగిరెడ్డి , సునంద దేవాలయాల అర్చకులు తదితరులు పాల్గొన్నారు.