మున్సిపల్ కార్యాలయంలో అవినీతి తిమింగలం

0
735 Views

అనంతగిరి డెస్క్:నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెవిన్యూ ఆఫీసర్ నరేందర్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) అధికారులు ఈరోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై జరిగిన ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, మరియు స్థిరాస్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఏసీబీ సోదాల్లో బయటపడిన వివరాలు:

నగదు: రూ. 2,93,81,000
బ్యాంకు ఖాతాల్లో: రూ. 1,10,00,000
బంగారు ఆభరణాలు: 6 కిలోలు
స్థిరాస్తులు: 17
మొత్తం ఆస్తుల విలువ: రూ. 6 కోట్ల 7 లక్షలు
ఈ సోదాలు నరేందర్ ఇంటితో పాటు, ఆయన కార్యాలయం మరియు బంధువుల ఇళ్లలో కూడా కొనసాగాయి. ఇప్పటి వరకు బయటపడ్డ ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ఈ భారీ అవినీతి చర్యకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది