వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా ఉండేలా చూడాలి: రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
275 Views

వికారాబాద్  : వసతి గృహాల్లో మౌలిక వసతులు సక్రమంగా ఉండేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అందించే అన్ని రకాల సదుపాయాలు సకాలంలో తీసు
కోవాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ వసతి గృహా సలహా సంఘం సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల వసతి గృహాల్లో నూతన విద్యార్థుల ప్రవేశాల కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా స్థాయి, డివి
జన్ స్థాయి అధికారులు వసతి గృహాలను సక్రమంగా పర్యవేక్షించాలని, విద్యార్థుల చదువు విషయంలో వసతి గృహ సంక్షేమ అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆయన స్పష్టం చేశారు. వి.
ద్యార్థుల ఆరోగ్యం, మానసిక వికాసం అభివృద్ధి కోసం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, వారి సమగ్ర అభివృద్ధికి అనువైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మద్దేశం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్, షెడ్యూల్ తెగల అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, తహసీల్దా
ర్డు ఎంఈవోలు వసతి గృహా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.