తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు ప్రతిపత్తి: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

0
91 Views

అనంతగిరిడెస్క్: తెలంగాణ టీడీపీ (టీటీడీపీ) నాయకులతో ముఖ్యమైన సమావేశంలో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం అనివార్యం అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సమావేశంలో చంద్రబాబు ప్రకటించినట్లుగా, ప్రతి నెల రెండవ శనివారం మరియు ఆదివారం ఆయన తెలంగాణకు పర్యటన చేస్తారు. ఆయన పార్టీ నిర్మాణం పైనే దృష్టి పెట్టి, త్వరలో గ్రామ స్థాయినుండి పార్టీ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు.అయితే, 15 రోజుల్లో తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రక్రియలో యువకులకు, బీసీలకు పెద్దపీట వేస్తామని తెలిపారు.తెలంగాణలో అధికారంలోకి రావడమే మా ప్రధాన లక్ష్యం, అని చంద్రబాబు స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తైన తరువాతనే టీటీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుందని ఆయన అన్నారు.