బీఆర్ఎస్ ఔట్ డేటెడ్, చర్చలే లేవు: బండి సంజయ్

0
175 Views

అనంతగిరిడెస్క్: బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి కేటీఆర్, బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఒక ఔట్ డేటెడ్ పార్టీ. ఆ పార్టీతో చర్చలు జరపాలనే ఆలోచన మాకు లేదు, అంతా ఫేక్ వార్తలు అని ఆయన అన్నారు.కవితకి బెయిల్ ఇవ్వడానికి తమకు ఏ సంబంధం లేదని, సిసోడియాకు మేము బెయిల్ ఇచ్చామా? బెయిల్ విషయంలో కోర్టులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయి. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదు,” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.అలాగే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై కూడా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ పార్టీతో జరగబోయేది యుద్దమే, అని ఆయన హెచ్చరించారు.అయితే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచే లుకలుకలు మొదలైనాయని, ఆ పార్టీకి సరిగా గతి పట్టడం కష్టమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.