తనాఫాన్ రకం స్వీట్ కార్న్ సీడ్‌తో అధిక దిగుబడులు:చెతాయ్‌ కంపెనీ ఆర్‌ఎం గణేష్‌, ఎస్‌వో శ్రీనివాస్‌

0
357 Views

వికారాబాద్‌ : తనాఫాన్ రకం స్వీట్ కార్న్ సీడ్‌తో అధిక దిగుబడులు సాధ్యమని చెతాయ్‌ కంపెనీ రీజనల్‌ మేనేజర్‌ గణేష్‌, ఎస్‌వో శ్రీనివాస్‌ అన్నారు. వికారాబాద్‌ మండలం నారాయణపూర్‌ గ్రామంలో స్వీట్ కార్న్ రైతు అంబారెడ్డి పొలంలో శనివారం ఫీల్డ్‌ విజిట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్‌ మండల పరిధిలోని మూలమాడ, పెళ్లి మడుగు, మీనపల్లి గ్రామ రైతులు హాజరయ్యారు. ఫీల్డు విజిట్‌లో భాగంగా రైతు అంబారెడ్డి స్వీట్ కార్న్ పంటతో తనకున్న అనుభవాన్ని వివరించారు. తాను నాలుగేళ్లుగా తనాఫాన్ రకంకు చెందిన స్వీట్ కార్న్ పంటను ఐదెకరాల విస్తీర్ణంలలో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఎకరం కు 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు చెప్పారు. ఈ కంపెనీకి చెందిన మొక్క రోగానికి తట్టుకునే శక్తి ఉంటుందని, నాటిన 70-74 రోజుల్లో కొత దశకు వస్తుందని తెలిపారు. కంకి బరువు కూ 470-550 గ్రాముల వరకు ఉంటుందని తోటి రైతులకు వివరించారు. ఒక సారి తనాఫాన్ రకం స్వీట్ కార్న్ వేసుకుని చూడాలని తెలిపారు.