అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
89 Views

వికారాబాద్:అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.సోమవారము జిల్లా సమాఖ్య భవనం లో జిల్లా సమాఖ్య అధ్యక్షుల తో ఏర్పాటు చేసిన సమావేశం పాల్గొని జిల్లా లో అన్ని మండలాల వారిగా వారి పరిదిలో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిదులను దుర్వినియోగం కాకుండా పిల్లలకు ఉపయోగ పడేవిధంగా పనులు చేయి౦చాలని ఆదేశించారు. మండలం వారిగా మండల సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని మండల సమాఖ్య అధ్యక్షులకు ఆదేశించారు. ఒక్కొక్కరికి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి , ఇప్పటి వరకు ఎంత బడ్జెట్ మంజూరు అయినది, మీ బడ్జెట్ ను బట్టి ఎన్ని స్కూల్స్ లో ఎన్ని రూమ్ లలో పనులు పూర్తి చేశారని, మండలం వారిగా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి స్కూల్ వారిగా త్రాగునీరు, టై లెట్స్ , లైట్స్, ఫ్యాన్స్ ,మైనర్ మేజరు రిపేరీ కు అయిన కర్చుల వివరాలు సబ్మిట్ చేయాలన్నారు.
మహిళా అభివృధ్హి పై ద్రుష్టి సారించాలని అన్నారు. గ్రామీణాభివృద్ధి సౌజన్యం తో స్కూల్ (యూని ఫార్మ్ ) దుస్తు ల తయారి లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి విద్యార్థిని విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా స్కూల్స్ కు అందజేయాల్సిన లైట్స్ ను, ఫ్యాన్ లను పరిశీలించారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ శ్రీనివాస్ , అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ , జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు, ఐ కే పి సమాఖ్య అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు