ప్రభుత్వం పై పోరాడేందుకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ

0
155 Views

అనంతగిరి డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మరల ఉమ్మడిగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు చేస్తున్నాయి. 2009-2014 మధ్య తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన జేఏసీను పోలి, ఈసారి ప్రభుత్వం మీద పోరాడేందుకు ఈ జేఏసీ ఏర్పాటైంది.

ఉద్యోగులు పీఆర్సీ (పే రివిజన్ కమిషన్), టీఏ (ట్రావెల్ అలావెన్స్), డీఏ (డియర్‌నెస్ అలావెన్స్) లాంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినా, ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యలను సీఎం కేసీఆర్‌ ముందు ఉంచి పరిష్కరించాలని కోరినా, ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని, జీతాలు కూడా చాలా శాఖల్లో 1వ తేదీన రావడం లేదని ఉద్యోగ జేఏసీ పేర్కొంది.

15 రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి, ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ హెచ్చరిక చేసింది.